Breaking News

రేపు భారత్ బంద్ లేదు.. ఏఐఎంపీఎల్‌బీ కీలక ప్రకటన

Published on Thu, 10/02/2025 - 14:21

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) అక్టోబర్ మూడున భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.  అయితే తాజాగా ఈ బంద్‌ను విరమిస్తున్నట్లు బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఫజ్లుర్ రహీమ్ ముజాద్దిది, ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ పండుగల కారణంగా బంద్ వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.

బంద్‌ విషయమై ఏఐఎంపీఎల్‌బీ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. అక్టోబర్ మూడున పలు ప్రాంతాలలో హిందూ సోదరుల మతపరమైన పండుగలు  జరగనున్నందున, తాము బంద్‌ను వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ప్రతినిధి ఇలియాస్ తెలిపారు. ప్రస్తుతానికి బంద్ విరమించినప్పటికీ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది.

గతంలో ఏఐఎంపీఎల్‌బీ అక్టోబర్ మూడున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది.  ఆ సమయంలో దుకాణాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని కోరింది. అవసరమైన వైద్య సేవలు, ఆసుపత్రులు, ఫార్మసీలకు బంద్ నుండి  మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏఐఎంపీఎల్‌బీ తాజాగా ప్రకటించింది. బంద్‌కు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
 

Videos

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

50 భాషల్లో కళ్ళు చెదిరేలా మహేశ్ బాబు వారణాసి

సాక్షి ఇంపాక్ట్.. ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్.. ఖోఖో అసోసియేషన్ సంచలన లేఖ

గంటలో 104 మి. మీ వర్షం.. జపాన్ ను ముంచేసిన వరద

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

Photos

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)