Breaking News

‘మూసీ ప్రాజెక్టు’కు ప్రపంచ బ్యాంకు రుణం

Published on Fri, 12/05/2025 - 04:01

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిధుల సేకరణలో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికకు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖకు చెందిన ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల శాఖకు సిఫార్సు చేసినట్లు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖన్‌ సాహూ వెల్లడించారు. గురువారం లోక్‌సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు .

అప్పు దొరకాలంటే డీపీఆర్‌ ఇవ్వాల్సిందే..: అయితే, ఈ రుణ ఒప్పందం ఖరారు కావడానికి కేంద్రం ఒక షరతు విధించింది. రుణ ఒప్పందంపై సంతకాలు చేసే ముందే.. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, స్టార్మ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌) కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజనీరింగ్‌ సంస్థ (సీపీహెచ్‌ఈఈఓ)కు సమర్పించి, వారి నుంచి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

అమృత్‌ 2.0 కింద రూ.3,849 కోట్లు..: కాగా అమృత్‌ 2.0 పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధి కోసం రూ.3,849.10 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి పేర్కొన్నా రు. ఈ నిధులతో 972 ఎంఎల్‌టీల మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 4.92 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మూసీ సుందరీకరణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోందని కేంద్రం తన సమాధానంలో పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)