Breaking News

‘ఆపరేషన్ అఖల్’లో ఉగ్రవాది హతం

Published on Sat, 08/02/2025 - 09:50

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాక్‌ ఉగ్రవాదల ఏరివేతకు భారత్‌ నడుంబిగించింది. తాజాగా కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించి అందిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపధ్యంలోనే ఒక ఉగ్రవాది హతమయ్యాడని  పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

రాత్రిపూట అడపాదడపా కాల్పులు కొనసాగాయని, అప్రమత్తమైన దళాలు దాడులను కొనసాగిస్తూ, ఉగ్రవాదులకు ఉచ్చు బిగించాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ ‘ఆపరేషన్ అఖల్’కు సంబంధించిన తాజా విజయాన్ని వెల్లడించింది. కుల్గామ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిఘా సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు తమ ఆపరేషన్ ప్రారంభించాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి.

జమ్మూలోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో దీనికి ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చొరబాటు యత్నంలో హతమయ్యారు. ఈ  ఘటన అనంతరం దేగ్వార్ సెక్టార్‌లోని కల్సియన్-గుల్పూర్ ప్రాంతంలో తాజా ఆపరేషన్ ప్రారంభమైంది. ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత సైనిక దళాలు జూలై 28న శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ సమీపంలోని లిద్వాస్ అడవిలో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)