Breaking News

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

Published on Sat, 06/21/2025 - 04:31

చురాచంద్‌పూర్‌/బిష్ణుపూర్‌: మణిపూర్‌లో మళ్లీ అశాంతి చెలరేగింది. గురువారం చురాచంద్‌పూర్‌ జిల్లాలోని చింగ్‌ఫీ గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కుకీ వర్గానికి చెందిన ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత బిష్ణుపూర్‌ జిల్లాలోని ఫుబాలా గ్రామంలో కాల్పుల్లో ఒక మైతేయి రైతు గాయపడ్డాడు. ఈ సంఘటనలతో ఈ ప్రాంతంలో మళ్లీ జాతుల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 

ఇరువర్గాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. పోలీసులు, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు బిష్ణుపూర్‌–చురాచంద్‌పూర్‌ సరిహద్దులో ఉన్న లోతట్టు గ్రామమైన ఫుబాలా వద్ద సాయుధులు కాల్పులు జరిపారు. పక్కనే ఉన్న కొండలలో నుంచి పొలాల్లో పనిచేస్తున్న రైతులపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. మైతేయి రైతు 60 ఏళ్ల నింగ్తౌజామ్‌ బిరెన్‌ ఎడమ చేతికి గాయమైంది. 

వెంటనే బిష్ణుపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి తరువాత, భద్రతా దళాలు సమీపంలోని చింగ్ఫీ గ్రామంలో ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో అను మానిత ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగా యి. ఈ కాల్పుల్లో  చురాచంద్‌పూర్‌లోని లాంగ్‌చింగ్‌మాన్‌బి గ్రామ అధిపతి ఖైఖోగిన్‌ హవోకిప్‌ భార్య హోయిఖోల్హింగ్‌ హవోకిప్‌ బుల్లెట్‌ తగిలి మరణించింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)