Breaking News

హర్యానా సీఎం రాజీనామా.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

Published on Tue, 03/12/2024 - 10:57

హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్‌తో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై, హర్యానా గవర్నర్‌ను కలిశారని సమాచారం.

హర్యానాలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై  కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది. 

ఈ నేపధ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫార్ములాపై బీజేపీ కసరత్తు చేసింది.

మరోవైపు.. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.  వీళ్ల భేటీలో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి  ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి  48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది.

అయితే.. హర్యానా కేబినెట్ నుంచి జననాయక్ జనతా పార్టీని తప్పించేందుకే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)