Breaking News

చలి చంపేస్తోంది.. అక్కడ ‘0’ డిగ్రీలు

Published on Thu, 11/20/2025 - 11:05

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంపై  చలిగాలుల ప్రభావం అధికంగా ఉంది.  ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో చలి, పొగమంచు విపరీతంగా ఉంది.

రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోగా, మౌంట్ అబూలో బుధవారం ‘సున్నా’ డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాత్రిపూట మంచు విపరీతంగా కురుస్తోంది. ఫతేపూర్, నాగౌర్, సికార్, దౌసా వంటి ప్రాంతాలలో కూడా  కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అస్సాం, మేఘాలయ, బిహార్, తూర్పు యూపీ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో మోస్తరు నుండి తేలికపాటి పొగమంచు కనిపించింది. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌లో ఎత్తయిన ప్రాంతాలలో చలి తీవ్రంగా పెరిగింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు రెండూ హిమపాతంతో మూసుకుపోయాయి. గత అక్టోబర్ 23న ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్‌నాథ్‌లో అత్యధిక హిమపాతం కురిసింది. బద్రీనాథ్‌లో కూడా ఉష్ణోగ్రతలు కనిష్టంగా తగ్గాయి. రాబోయే 48 గంటల్లో ఉత్తరాఖండ్‌తో సహా హిమాలయ ప్రాంతాలలో హిమపాతం తో పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కేరళ, తమిళనాడులలో తేలికపాటి  వర్షాలు కురిశాయి. అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం, లక్షద్వీప్‌లలో కూడా తేలికపాటి  వర్షం కురిసింది. కర్ణాటక దక్షిణ తీరంలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)