Breaking News

37 నగరాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Published on Mon, 05/27/2024 - 07:24

దేశంలోని ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. 37 నగరాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధికంగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఫలోడి వరుసగా రెండో రోజు దేశంలోనే  అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.  

ఢిల్లీలోని ఎనిమిది చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్‌పూర్, నజఫ్‌గఢ్‌లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్‌లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాజస్థాన్‌లోని బార్మర్‌లో 49 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలా, యవత్మాల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)