Breaking News

మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

Published on Sun, 01/12/2025 - 03:03

సాక్షి, న్యూఢిల్లీ:  మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం చింతన్‌ శివిర్‌ కార్యక్రమం జరిగింది. 

సదస్సుకు తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్‌ కాంతి వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపై సీతక్క ప్రసంగించారు. తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలను నడుపుతున్నట్లు చెప్పారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వయం సహాయక బృందాల మహిళలతో.. అంగన్‌వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్‌లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. మహిళ, శిశు సంక్షేమం విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని సీతక్క కోరారు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా! 😍🦚

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)