Breaking News

యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్‌ నిలువురాళ్లు

Published on Sat, 03/15/2025 - 05:41

న్యూఢిల్లీ: తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. వీటితోపాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టీ యోగినీ దేవాలయాల వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్‌ నామినేట్‌ చేసింది. వీటిని మార్చి 7న తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్‌లో తెలిపింది. 

ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. ఈ ఏడాది భారత్‌ చేర్చిన జాబితాలో చత్తీస్‌గఢ్‌లోని కంగెర్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్, తెలంగాణలోని ముడుమాల్‌ మెగాలితిక్‌ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్‌ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయి. వీటితో భారత్‌ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది.  

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)