Breaking News

కొనేవాళ్లంతా మనోళ్లే!

Published on Sat, 11/29/2025 - 04:08

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్రమంగా ఉంటూ నైజీరియన్‌లు చేస్తున్న డ్రగ్స్‌ దందాలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన 1975 మందికి నైజీరియన్‌లు ప్రతిరోజూ ఆన్‌లైన్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ–కామర్స్‌ వేదికగా ఈ దందా నడుస్తోందని గుర్తించారు. 

మనదేశానికి చెందిన వందలాది ‘మ్యూల్‌’ అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. మూడు నెలలు రెక్కీ నిర్వహించి వారందర్నీ అరెస్టు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ జాయింట్‌ సీపీ సురేంద్ర కుమార్‌.. డీసీపీ హర్షీణ్, ఈగిల్‌ ఎస్పీ సీతారామ్‌తో కలిసి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

నైజీరియన్‌లే తమ అడ్రస్‌కు బుకింగ్‌
హైదరాబాద్‌కు చెందిన పలువురు డ్రగ్‌ కావాలని అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్‌ నిక్‌ను వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్‌ యాప్‌ల ద్వారా సంప్రదిస్తున్నారు. నిక్‌ ఢిల్లీలో ఉన్న నైజీరియన్‌ భద్రుదీన్‌కు మన వాళ్ల ఫోన్‌ నంబర్‌ పంపుతాడు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్‌కు బానిసైన వారిని నిక్, భద్రుదీన్‌లు వలలో వేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. నిక్‌ను సంప్రదించే వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సినిమా, వ్యాపార రంగాల వారున్నట్లు పోలీసులు గుర్తించారు. 

డ్రగ్‌ కావాల్సిన వారి అడ్రస్‌ను భద్రుదీన్‌ తీసుకుని నిక్‌కు సమాచారం ఇస్తాడు. వీరికి కావాల్సిన డ్రగ్‌కు రేటును నిక్‌ నిర్ధారించి, యూపీఏ నంబర్‌ ఇస్తాడు. డబ్బులు క్రెడిట్‌ అయిన తర్వాత ఈకామర్స్‌ సైట్‌ ద్వారా కాస్మోటిక్స్, షూస్, స్లిప్పర్స్, డ్రస్సులు వంటివి ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లోని అడ్రస్‌లకు బుక్‌ చేస్తారు. హైదరాబాద్‌లో డ్రగ్‌ అడిగిన వ్యక్తి మహిళ అయితే కాస్మోటిక్‌లో ఆ డ్రగ్‌ను అమర్చుతారు. 

అదే పురుషుడు అయితే షూస్, షర్ట్, ప్యాంట్‌ వంటి వాటిలో డ్రగ్‌ను అమర్చుతారు. దాన్ని హైదరాబాద్‌లోని అడ్రస్‌కు పంపుతారు. ఈ అడ్రస్‌పై స్థానిక వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను ఇవ్వరు, నైజీరియన్‌ నెట్‌వర్క్‌లో ఉన్న వ్యక్తి నంబర్‌ను ఇస్తారు. పార్సిల్‌ హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే కొరియర్‌ బాయ్‌/ఆఫీస్‌ వాళ్లు ఆ ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తారు. 

ఆ తర్వాత సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేసి ఫలానా ప్రాంతంలో ఉన్న కొరియర్‌ ఆఫీస్‌కు వెళ్లి పార్సిల్‌ తీసుకోమంటారు. ఆ పార్సిల్‌ను తీసుకున్న మన వాళ్లు డ్రగ్‌ వినియోగించి మద్యం మత్తులో ఊగుతున్నారు. ఈగిల్‌ టీం ఈ డ్రగ్‌ దందా గుట్టును రట్టు చేసింది.

చదువుకోవడానికి వచ్చిన వారి ఖాతాలతో..
వివిధ దేశాల నుంచి చదువుకోవడానికి వచ్చి మనదేశంలో బ్యాంకు ఖాతా తీసుకున్న వారి వివరాలను ఈ నెట్‌వర్క్‌ సేకరిస్తుంది. ఒక్కో అకౌంట్‌కు ఒక్కో రేటు ఇచ్చి ఆ ఖాతా (మ్యూల్‌ఖాతాలు)లను తీసుకుంటుంది. కొందరు విద్యార్థులు నైజీరియాకు వెళ్లిపోయినా వారి ద్వారా ముందుగానే అకౌంట్‌లను ఓపెన్‌ చేపించారు. ఆ ఖాతాలకు భద్రుదీన్, అతని భార్య సనా, ఇతర స్నేహితుల ఫోన్‌ నంబర్‌లను ఇచ్చారు. మనదేశంలో ఉన్న ఖాతాలో డబ్బు పడగానే విదేశాల్లో ఉన్న నిక్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. వీళ్లకు ఇవ్వాల్సిన పర్సెంటేజ్‌ను నిక్‌ ఇచ్చేస్తారు.

మూడు నెలలుగా ఈగిల్‌ రెక్కీ
హైదరాబాద్‌లోని ‘మల్నాడు’ రెస్టారెంట్‌ డ్రగ్‌ రాకెట్‌ బయటపడిన తర్వాత పోలీసులు ఈ డ్రగ్‌ దందాపై దృష్టిసారించారు. విదేశాల్లో ఉన్న నిక్‌.. భద్రుదీన్‌ ద్వారా ఇదంతా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. తమకు డ్రగ్‌ కావాలంటూ ఆర్డర్‌ పెట్టారు. డబ్బు పంపిన అకౌంట్‌ నంబర్, మాట్లాడిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా మూడు నెలల క్రితం ఢిల్లీకి చేరుకుని ఈ నైజీరియన్‌ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టారు. డ్రగ్‌ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రతీ సభ్యుడి ఇంటిపై రెక్కీ చేశారు. 

ఈగిల్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యా కూడా మారువేషంలో రెక్కీ చేశారు. ఢిల్లీ, నోయిడాలో అయితే డైరెక్ట్‌గా డ్రగ్‌ కావాల్సిన వారికి నైజీరియన్‌లే నేరుగా ఇంటికెళ్లి సరఫరా చేస్తున్నారు. ఇదంతా గుర్తించిన మన ఈగిల్‌ టీం.. ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ సాయం తీసుకుని 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి వారందర్నీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌ కేసుతో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు శనివారం హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.  

#

Tags : 1

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)