Breaking News

తేజస్ ప్రమాదం: ఫైలట్ దూకుదామని ‍ప్రయత్నించాడు కానీ?

Published on Sun, 11/23/2025 - 17:16

దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలి వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ప్రమాదానికి గురవుతుందని ముందుగానే ఫైలట్ గ్రహించాడని అతను జెట్ నుంచి కిందకి దూకుదామని ప్రయత్నించాడని దర్యాప్తు బృందాలు తెలిపాయి. కానీ ఫైలట్ ఎందుకు జెట్ నుంచి దూకలేకపోయాడో  అనే సంగతి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

రెండు రోజుల క్రితం దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ జెట్ కూలి వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ మృతిచెందారు. అయితే  ఆ ప్రమాద సమయంలో ఫైలట్ జెట్ నుంచి దూకి తప్పించుకొనే ప్రయత్నం చేశాడని దర్యాప్తు బృందాలు తెలిపాయి. కానీ ఆయన అలా చేయకపోవడానికి జెట్‌లో ఏదైనా సాంకేతిక కారణాలు తలెత్తి ఉండవచ్చని లేదా ఫైలట్ ఆరోగ్య పరిస్థితులైనా సహకరించకపోయి ఉండచ్చని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి.

ఆ వివరాలు జెట్‌కు సంబంధించిన బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే తెలుస్తాయని ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారులు తెలిపారు. కాగా ఎయిర్ షో ప్రారంభానికి ముందు వింగ్ కమాండర్ సయీల్  కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేత్, యూఏఈ భారత రాయభారి దీపక్ మిట్టల్ తో మాట్లాడుతున్న వీడియో వైరలవుతోంది. అందులో నిమాన్ష్ సరదాగా నవ్వుతూ అధికారులతో మాట్లాడుతున్నారు.

వింగ్ కమండర్ నమాన్ష్ సయీల్ అంత్యక్రియలు నేడు హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వంత గ్రామం పాటియాల్కర్ లో జరిగాయి. తన కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్‌ఫోర్స్ అధికారులు, స్థానికులు పెద్దఎత్తున హాజరై నమాన్ష్‌కు ఘన నివాళులు అర్పించారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)