Breaking News

ఆఫీసులో సినిమా పాట పాడినందుకు.. తహశీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు

Published on Mon, 08/18/2025 - 08:13

లాతూర్‌: బదిలీ అయిన తహశీల్దార్‌ ఒకరు ఆఫీసులో ఏర్పాటైన వీడ్కోలు సమావేశంలో హిందీ పాట పాడిన పాపానికి సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాందేడ్‌ జిల్లా ఉమ్రిలో తహశీల్దార్‌గా ఉన్న ప్రశాంత్‌ థోరట్‌ ఇటీవల పొరుగునే ఉన్న లాతూర్‌ జిల్లా రెనాపూర్‌కు బదిలీ అయ్యారు. జూలై 30వ తేదీన ఉమ్రిలో ఆయనకు కార్యాలయం సిబ్బంది సెండాఫ్‌ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ థోరట్‌ ఉత్సాహంతో 1981నాటి అమితాబ్‌ బచ్చన్‌ సినిమా యారానాలోని ‘యారా తేరీ యారీ కో..’అంటూ పాటపాడారు. 

అక్కడి వారంతా చప్పట్లతో ఆయన్ను ఉత్సాహ పరిచారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ప్రశాంత్‌ థోరట్‌ వెనుక తాలూకా మేజిస్ట్రేట్‌ అనే నేమ్‌ ప్లేట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. థోరట్‌ ప్రవర్తన అధికార హోదాకు తగినట్లుగా లేదంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు మహారాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ప్రవర్తన నిబంధనావళి–1979కు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంపై థోరట్‌ సస్పెన్షన్‌కు శనివారం ఆదేశాలిచ్చారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)