Breaking News

ఖరీదైన ఫోను కోసం గొడవ.. బోరు బావిలో దూకి టీనేజర్‌ ఆత్మహత్య

Published on Mon, 12/08/2025 - 07:18

కచ్‌: సెల్‌ ఫోన్‌ విషయమై తండ్రితో గొడవపడిన ఓ టీనేజర్‌ బోరుబావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుజరాత్‌లోని కచ్‌ జిల్లా భుజ్‌ తాలుకాలో ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం కుక్మా గ్రామంలోని ఫాంహౌస్‌లో ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన రుస్తొమ్‌ షేక్‌(17) శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఖరీదైన సెల్‌ఫోన్‌ విషయంపై తండ్రితో గొడవపడ్డాడు. 

చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి పారేసి, దగ్గర్లో ఉన్న పడావు పడిన బోరు బావి వద్దకు చేరుకున్నాడు. దానిపైన అడ్డుపెట్టిన బండరాయిని తొలగించి అమాంతం లోపలికి దూకాడు. భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో, అడుగున్నర వెడల్పున్న ఆ బావి లోతు 140 అడుగులు. సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఊపిరి అందక రుస్తొమ్‌ కేకలు వేస్తుండటంతో లోపలికి ఆక్సిజన్‌ను పైపుల ద్వారా పంపించారు. 

వెంటనే సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతడిని అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో వెలుపలికి తీయగలిగారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

#

Tags : 1

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)