Breaking News

కంటతడి పెట్టిస్తున్న అమ్మ ప్రేమ.. తెగిపడిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని లాలిస్తూ.. రోదిస్తూ

Published on Thu, 10/31/2024 - 13:34

లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్‌ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం  ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.

గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్‌ జీత్‌ యాదవ్‌ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్‌ జీత్ కుమారుడు అనురాగ్‌ వెంటబడ్డారు.

నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్‌ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి