Breaking News

సీక్రెట్‌ కెమెరా.. మహిళలు స్నానం చేసే వీడియోలు ప్రియుడికి..

Published on Thu, 11/06/2025 - 10:23

తమిళనాడు రాష్ట్రం: ఆమె బుద్ధి తప్పుదోవ పట్టింది, ఇతర మహిళల వీడియోలను తీసుకుని ప్రియునికి పంపింది. ఫలితంగా రచ్చ చెలరేగింది. బెంగళూరు సమీపంలోని పారిశ్రామిక నగరం హోసూరు వద్ద అకృత్యం బయటపడింది. కంపెనీ మహిళా సిబ్బంది బస చేసే హాస్టల్‌ బాత్‌రూంలో రహస్య కెమెరాను ఏర్పాటు చేసి ఆ చిత్రాలను ఇంటర్నెట్‌లో వైరల్‌ చేశారు.  ఇది తెలిసి మహిళా సిబ్బంది ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.  వివరాలు ఇలా ఉన్నాయి.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎల్రక్టానిక్స్‌ కంపెనీ నడుస్తోంది, ఇందులో వేలాది మంది మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వారి కోసం ఉద్దనపల్లి వద్ద ప్రత్యేక హాస్టల్‌ వసతిని కల్పించింది.   

నీలాకుమారి నిర్వాకం  
ఒడిశాకు చెందిన నీలా కుమారి గుప్తా (23) కూడా కంపెనీలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు ఏం దుర్బుద్ధి పుట్టిందో మరి ఓ బాత్‌రూంలో రహస్య కెమెరా ఉంచి తోటి మహహిళలు స్నానం చేసే దృశ్యాలను మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేసుకుంది. వాటిని బెంగళూరులో ఉండే తన ఒడిశా ప్రియునికి పంపుతోంది. అతడు వాటిని ఇంటర్నెట్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో పోస్టు చేసేవాడు. తమ చిత్రాలు నెట్‌లో వ్యాపించాయని తెలిసి మహిళలు కంగుతిన్నారు. మంగళవారం రాత్రి సుమారు రెండువేల మంది మహిళలు, యువతులు హాస్టల్‌ ముందు ధర్నాకు దిగారు. దుండగులను శిక్షించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఎస్పీ ఎస్పీ తంగదురై వచ్చి వారితో మాట్లాడినా శాంతించలేదు.  నీలాకుమారిని అరెస్ట్‌ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు.  ప్రియుని కోసం గాలిస్తున్నారు.      

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)