Breaking News

రాణాపై రోజూ 8–10 గంటలు ప్రశ్నల వర్షం 

Published on Tue, 04/15/2025 - 06:20

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ రాణా(64)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)అధికారులు రోజులో 8 నుంచి 10గంటలపాటు ప్రశ్నిస్తున్నారు. పేలుళ్ల వెనుక కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. 2008 నవంబర్‌ 26వ తేదీన దాడులకు ముందు అతడు దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన పర్యటనల వెనుక ఉద్దేశాన్ని కనుగొనే దిశగా విచారణ సాగుతోందన్నారు. 

ఈ నెల 10న అమెరికా నుంచి తీసుకు వచ్చిన రాణాను ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతించడం తెల్సిందే. రాణాకు ఆరోగ్య పరీక్షలు చేయించడంతోపాటు లాయర్‌ను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన విచారణాధికారి జయా రాయ్‌ సారథ్యంలో విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారులకు రాణా సహకరిస్తున్నాడని ఓ అధికారి వెల్లడించారు. 

రాణా కోరిన మేరకు పెన్, నోట్‌ ప్యాడ్, ఖురాన్‌ను సమకూర్చామన్నారు. ఇతర నిందితులకు మాదిరిగానే ఆహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా ఏదీ అతడు కోరలేదన్నారు. రాణా ప్రస్తుతం ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో అత్యంత భద్రత కలిగిన సెల్‌లో ఉన్నాడు. కుట్ర, హత్య, ఉగ్రకార్యకలాపాలకు ఊతమివ్వడం, ఫోర్జరీ తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా, హర్కతుల్‌ జిహాదీ ఇస్లామీకి చెందిన పలువురు ఉగ్ర నేతల ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.  

ఢిల్లీలోనూ దాడులకు కుట్ర 
2008 నవంబర్‌ 26వ తేదీన ముంబై ఉగ్రదాడులకు పథకం రచన చేసిన తహవ్వుర్‌ రాణా అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలోనూ మారణ హోమం సృష్టించేందుకు పథకం వేసినట్లు వెల్లడైంది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్‌ జిత్‌ సింగ్‌ ఈ నెల 10వ తేదీన జారీ చేసిన 10 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘దేశమంతటా విస్తృతంగా పర్యటన చేసిన రాణా పలు నగరాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇందులో ఢిల్లీ కూడా ఉన్నట్లు ఎన్‌ఐఏ ఆధారాలున్నాయి. 

జాతీ భద్రతకు సంబంధించిన విషయం ఇది. దీని వెనుక ఉన్న భారీ కుట్రకోణాన్ని ఛేదించేందుకు రాణా కస్టోడియల్‌ విచారణ అవసరం. సాకు‡్ష్యల విచారణ, ఆధారాల సేకరణ, రాణా అతడి అనుయాయుల పర్యటనల వివరాలను రాబట్టాల్సి ఉంది. 17 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలపై రాణాను పలు కీలక ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది’అని అందులో పేర్కొన్నారు. అనేక ఆరోగ్య సమస్యలున్న రాణాకు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన ఆదేశించారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)