Breaking News

ఎడమ కాలుకి కణితి.. కుడి కాలుకి ఆపరేషన్‌ 

Published on Mon, 07/27/2026 - 01:48

గురుగ్రామ్‌: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అని సామెత. హరియాణాలో ఈ వైద్యులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ డాక్టర్లు ఏం చేశారంటే.. బాలునికి ఓ కాలుకు సమస్య ఉందని వెళ్తే మరో కాలుకి శస్త్ర చికిత్స చేశారు. నూహ్‌ జిల్లాలోని నల్హార్‌లో షహీద్‌ హసన్‌ ఖాన్‌ మేవాతి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యాన్ని మరోసారి వెలుగులోకి తెచి్చంది. ఆరిఫ్‌ తన నాలుగేళ్ల బాలుడి ఎడమ కాలులో కణితి చికిత్స కోసం జూలై 20న వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. చూసిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అలాగే, బాలుడి కాలికి శస్త్రచికిత్స చేశారు. 

చికిత్స అనంతరం బయటికి తీసుకురాగానే కుడి కాలికి శస్త్రచికిత్స జరిగిందని ఆరిఫ్‌ గుర్తించాడు. ఎడమకాలికి చేయాల్సి ఉండగా కుడి కాలుకు చికిత్స చేశారని డాక్టర్ల నిర్లక్ష్యాన్ని తెలియ జేశాడు. అల్ట్రాసౌండ్‌ రిపోర్ట్‌ను చూసిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ తన పొరపాటును అంగీకరించి, ఆ తర్వాత మరో కాలికి సైతం శస్త్రచికిత్స చేశాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైద్య కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు వైద్య కళాశాల డైరెక్టర్‌ నలుగురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)