Breaking News

కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..?

Published on Tue, 11/07/2023 - 13:24

ఢిల్లీ: పంట వ్యర్థాల దహనాలపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రతిఏటా దేశ రాజధానిని కాలుష్య కాసారంగా తయారుచేయడం సరికాదని తెలిపింది. పీల్చే గాలిని కలుషితం చేయడం ప్రజలను హత్య చేయడమేనని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇది మీకు ఏం పట్టదా..? అని ప్రశ్నించింది. ఈ సమస్యపై చర్చించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు సమావేశం నిర్వహించాలని కోరింది. శుక్రవారం నాటికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని గడువు విధించింది. 

"పంజాబ్, హర్యానా సహా పొరుగురాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి ప్రధాన కారణం. పంట వ్యర్థాలు కాల్చడం ఆపేందుకు చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎలా నిలిపివేస్తారో మాకు తెలియదు. అది మీ పని. ఢిల్లీ కాలుష్యం తగ్గేందుకు వెంటనే ఏదో ఒకటి చేయండి" అని కోర్టు ఆదేశించింది.

ఢిల్లీ వాయు కాలుష్యం రాజకీయ చర్చ కారాదని జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కాలుష్యంతో పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 20-50 రోజులు మాత్రమే తమ రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేతలు ఉంటాయని పంజాబ్ అటార్ని జనరల్‌ తెలిపిన క్రమంలో ఇది అదే సమయమని తెలిపిన జస్టిస్ కౌల్.. కాలుష్యంపై అలసత్వం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.  బలవంతంగానైనా, ప్రోత్సాహకాల ద్వారానైనా పంట వ్యర్థాల కాల్చివేతలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. 

కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణం అవుతున్నందున.. ఢిల్లీలోకి వెహికిల్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్ కౌల్ ధర్మాసనం కోరింది. పంట వ్యర్థాల కాల్చివేతలపై స్పందిస్తూ.. పంట మార్పిడి విధానాలను అనుసరించాలని సూచించింది. ఏదేమైనా ఈ అంశంపై ఓర్పు వహించే అవకాశమే లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: Delhi Air Pollution Updates: ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)