Breaking News

కుమారుని మృతదేహం పక్కన లేఖ.. వెలుగులోకి కీలక విషయాలు

Published on Fri, 01/12/2024 - 13:03

భళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని మైండ్‌పుల్ ఏఐ సీఈఓ సుచనా సేథ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుని మృతదేహాన్ని ఉంచిన బ్యాగులో ఓ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విడిపోయిన భర్త తన కుమారున్ని కలవడానికి అనుమతించిన కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుచనా నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

టిష్యూ పేపర్‌పై ఐలైనర్ వాడి సుచనా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ' ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి.  కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి. " అని ఆమె అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుని మృతదేహం వద్ద ఈ లేఖ పెట్టినట్లు తెలుస్తోంది. సుచనా మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పోలీసుల విచారణకు సుచనా సహకరించడం లేదని సమాచారం. కుమారున్ని చంపినందుకు ఆమెలో కొంచెం కూడా మానసిక పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య, మానసిక పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాగులో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. భార్య-భర్తల మధ్య విబేధాల కారణంగా కొడుడు కస్టడీ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్‌ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు