Breaking News

‘కుక్కల కుంభకోణం’: బయటపెట్టిన మేనకా గాంధీ

Published on Sat, 07/04/2026 - 13:13

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండటం, ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సంచలన విషయాలను వెల్లడించారు. కుక్కలను వీధుల నుండి లేదా బహిరంగ ప్రదేశాల నుండి తొలగించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని ఆమె స్పష్టం చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే ఏకైక మార్గమని, నకిలీ స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంస్థల పర్యవేక్షణ లోపం కారణంగానే నేడు దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యిందని ఆమె ఆరోపించారు.

నకిలీ ఎన్జీవోల కుంభకోణం
గత 25 ఏళ్లుగా యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని నిజాయితీగా, శాస్త్రీయంగా అమలు చేసి ఉంటే నేడు వీధి కుక్కల సమస్య ఉత్పన్నమయ్యేదే కాదని మేనకా గాంధీ పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లోని అవినీతి సిబ్బందితో చేతులు కలిపిన కొన్ని నకిలీ ఎన్జీవోలు, రికార్డుల్లో అవసరానికి మించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చూపించి భారీ మోసాలకు పాల్పడ్డాయని ఆమె ఆరోపించారు. దేశంలోని 200 కంటే ఎక్కువ జిల్లాల్లో అర్హత, శిక్షణ లేని ముఠాలకు లంచాల ప్రాతిపదికన ఈ కాంట్రాక్టులు ఇచ్చారని, అక్కడ కనీసం డాక్టర్లు కూడా లేరని ఆమె ఆరోపించారు.

కుక్కల దూకుడుకు అసలు కారణాలివే
శిక్షణ లేని పారిశుధ్య కార్మికులతో ఆపరేషన్లు చేయడం వల్ల కుక్కలు తీవ్రమైన నొప్పితో మరింత హింసాత్మకంగా మారుతున్నాయని మేనకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రాంతంలోని కుక్కలను వేరే ప్రాంతంలో వదిలేయడం వల్ల, అవి కొత్త వాతావరణంలో అభద్రతాభావానికి గురై సాధారణ ప్రజలపై దాడులు చేస్తున్నాయని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఎలాంటి రెచ్చగొట్టడం లేకుండా మూడుసార్లు కరిచే కుక్కను మాత్రమే దూకుడు స్వభావం గలదిగా గుర్తించి పర్యవేక్షణలో ఉంచాలని ఆమె గుర్తుచేశారు.

రెండేళ్లలో సమస్యకు శాశ్వత పరిష్కారం
విదేశీ బ్రీడ్స్ కంటే భారతీయ దేశీయ కుక్కలను పెంచుకోవడమే శ్రేయస్కరమని మేనకా గాంధీ సూచించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డును బలోపేతం చేసి, ఎన్జీవోలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వం కఠినంగా నిబంధనలను అమలు చేస్తే.. కేవలం రెండేళ్లలోనే కుక్కల దాడుల సమస్యను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని ఆమె పేర్కొన్నారు. మానవ భద్రత, జంతు సంక్షేమం పరస్పర విరుద్ధం కాదని, అందరి బాధ్యతాయుతమైన సహకారంతోనే దీనికి శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని మేనకా గాంధీ వివరించారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)