Breaking News

మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Published on Tue, 09/24/2024 - 09:13

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన సమయంలో మహాబోధి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి బీహార్‌లోని గయకు వెళుతోంది.

ఈ రాళ్లదాడిలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి యమునా బ్రిడ్జి సమీపంలో ఈ రాళ్లదాడి జరిగింది. మిర్జాపూర్ స్టేషన్‌లో రైలును నిలిపివేసి, గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందించారు. అలాగే దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ రైలుపై రాళ్లు రువ్విన ఐదుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్టు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (మహాసముంద్) ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ సింగ్ ధాకడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రైలు విశాఖపట్నం నుండి దుర్గ్‌కు తిరిగి వస్తుండగా బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. రైలు దుర్గ్ నుండి ట్రయల్ రన్ కోసం బయలుదేరిందని, రాయ్‌పూర్ గుండా మహాసముంద్ చేరుకుందని ధాకడ్ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)