Breaking News

మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు

Published on Sun, 09/29/2024 - 10:53

మహోబా: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్ పిల్లర్‌ను  ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్‌ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్‌పై ఉంచిన పోల్‌ను తొలగించిన  అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.

ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్‌పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్‌లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్‌పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)