Breaking News

'వేడి'.. ప్రాణాలపై దాడి

Published on Wed, 03/11/2026 - 01:17

మూడు అత్యధిక ఉష్ణ సంవత్సరాలుగా 2023, 2024, 2025 రికార్డు సృష్టించినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత లానినా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే 2026 కూడా ఈ వరుసలో చేరేలా ఉంది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆసియా ఖండంలో వేడి రెట్టింపవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ మన దేశంలో అధిక వేడి ముప్పు స్థితిగతులు ఎలా ఉన్నాయి? అధ్యయనాలేం చెప్తున్నాయి? ప్రభుత్వాలేం చేస్తున్నాయి?   -సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

విపత్తు అంటే? 
భారతీయ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం పగటి ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్, కోస్తా తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు దాటితే వడగాడ్పు (హీట్‌వేవ్‌) పరిస్థితులు ఏర్పడినట్లు భావిస్తారు. ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే వడగాడ్పు రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే తీవ్ర వడగాడ్పుల రోజుగా ప్రకటిస్తారు.  

ఎవరికి ఎక్కువ ముప్పు?  
ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఎండ దెబ్బ ముప్పు మరీ ఎక్కువ. ఇతర వయసు్కల కంటే వృద్ధులు, పిల్లలకు ముప్పు ఎక్కువ. 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ఎండ వల్ల ప్రతి డిగ్రీకి 2–3 శాతం మేరకు పని సామర్థ్యం తగ్గిపోతోంది.

57 శాతం జిల్లాలకు అధిక వేడి ముప్పు 
కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోని సగానికి పైగా (57%) జిల్లాల్లో అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 734 జిల్లాలకు గాను 151 జిల్లాలు అధిక వేడి ముప్పును, 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే జీవిస్తున్నారు. గత 40 ఏళ్లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పగళ్ల కంటే రాత్రులే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది.  

ఏసీలు, కూలర్ల వాడుక ఎంత? 
మండే ఎండలను తట్టుకునేందుకు గదుల్లో కూలింగ్‌ సదుపాయం కల్పించుకోవటం ప్రజలకు నిత్యావసరంగా మారుతోంది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే (2024) గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం కుటుంబాలు, నగరాలు/పట్టణాల్లో 42 శాతం కుటుంబాలు మాత్రమే ఎయిర్‌ కండిషనర్లు లేదా కూలర్లను ఉపయోగిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లను మాత్రం 33 శాతం గ్రామీణ కుటుంబాలు, 68 శాతం నగర/పట్టణ కుటుంబాలు వాడుతున్నాయి.  

ఏటా5.46 లక్షల మంది మృతి 
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం  ప్రకారం  ఆరుబయట పనులు చేసే 160 కోట్ల మందికి అధిక వేడి ముప్పుఎక్కువగా ఉంది. కూలింగ్‌ సదుపాయాలు తక్కువగా ఉన్న భారత్‌ సహా 77 దేశాల్లోని  100 కోట్ల మందికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. ఎక్స్‌ట్రీమ్‌ హీట్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,46,000 మంది చనిపోతున్నారని ‘సస్టెయినబుల్‌ ఎనర్జీ ఫర్‌ ఆల్‌’సంస్థ నివేదిక చెబుతోంది.  

2024లో మేల్కొన్న ప్రభుత్వం
అధిక వేడి ముప్పు గత మూడేళ్లలో ఉధృతం కావటంతో అధిక వేడిని తట్టుకునే ప్రత్యేక ప్రణాళికలతో పాలకులు సంసిద్ధతను పెంచుకోవటం తప్పనిసరైంది. అధిక వేడిని ఒక విపత్తుగా పరిగణిస్తూ 2024లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. వడగాడ్పుల బాధితుల కోసం విపత్తు సహాయక నిధులను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీంతో అవకాశం ఏర్పడింది. అనేక రాష్ట్రాలు నగర, జిల్లా, స్థానిక స్థాయిలో హీట్‌ యాక్షన్‌ ప్లాన్లను రూపొందించుకోవటం ప్రారంభించాయి. ఫలితంగా కొన్ని చోట్ల అధిక వేడిని తట్టుకునే ఉపాయాలను ప్రభుత్వ స్థాయిలో అమలు చేయడం మొదలైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)