Breaking News

ఐటీ ఉద్యోగితో పోలిస్తే వారికి రెట్టింపు ఆదాయం

Published on Mon, 06/30/2025 - 15:14

కెరీర్‌కు బంగారు బాటగా ఇంజనీరింగ్ను పరిగణించే మన దేశంలో.. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవడానికి దాదాపు రూ.10-20 లక్షలు ఖర్చు చేయాలి. అంతేకాదు జీవితంలో విలువైన 4 సంవత్సరాలు వెచ్చించాలి. ఇంత వ్యయ ప్రయాసలకు ఓరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరితే చేతికి వచ్చే జీతం ఎంతో తెలుసా? సగటున గంటకు రూ.139-186 మాత్రమే. అదేదో చిన్నాచితకా కంపెనీల్లో వీరు ఉద్యోగం చేస్తు న్నారా అంటే అదీ కాదు. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో! ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్ల వంటి నిపుణులైన కార్మికుల కంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందుకునే వేతనం తక్కువ.
-సాక్షి, స్పెషల్ డెస్క్


భారత్‌లో ఎంట్రీ-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సగటు జీతం 2007-2010 కాలంలో సంవత్సరానికి దాదాపు రూ.3.5 లక్షలుగా ఉండేది. అప్పటితో పోలిస్తే 2024లో ఆర్థికంగా చాలా మార్పులు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలూ పెరిగోయి, కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాలామంది ప్రెసర్ల వేతనాల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. 

అర్బన్ కంపెనీ, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి ప్లాట్ఫామ్స్‌లో పనిచేస్తున్న కార్మికులైతే బీటెక్ గ్రాడ్యుయేట్ల కంటే రెండింతలకుపైనా ఆదాయం అందుకుంటున్నారని ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కంపెనీ 'కెరీ ర్స్ 360' నివేదిక చెబుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్స హించాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.

బీటెక్ చదువు ఖర్చు పెరిగింది... రోజుకు 9 గంటల చొప్పుననెలలో 20 రోజుల పని దినాలకు అంటే నెలలో 180 గంటలు విధులు నిర్వర్తించారని భావిస్తే.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లో ఫ్రెషర్లు అందుకునే వేతనం కంపెనీని బట్టి గంటకు రూ. 130 నుంచి రూ.180 మధ్య ఉంది. బీటెక్ డిగ్రీ దశాబ్దన్నర క్రితం రూ.1-2 లక్షల్లో పూర్తి అయ్యేది. ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లకుపైనే ఖర్చు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తమ నాలుగేళ్ల చదువు కోసం అధిక సమయం. కృషి, డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ, చదువు పూర్తై పట్టా చేతికొచ్చాక.. కోటి ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరితే జీతాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.

రికవరీకి 6-8 ఏళ్లు..
అర్బన్ కంపెనీలో నైపుణ్యం కలిగిన కార్మికులు సగటున గంటకు రూ.311 సంపాదిస్తున్నారు. ప్లంబర్లు. ఎలక్ట్రిష్ యన్స్, టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, కార్పెంటర్లు, డ్రైవర్లు, మసాజ్ థెరపిస్ట్ వంటి నైపుణ్యం కలిగిన ఈ కార్మి వీలు నెలకు సగటున 160 గంటలు పనిచేస్తే.. పన్నులు. కమీషన్, మెటీరియల్ వ్యయాలు పోను నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదిస్తున్నారు.

ఇది కేవలం జీతాల పోలిక కాదని కెరీర్స్ 300 అంటోంది. 2010 పూర్వం బీటెక్ విద్యార్ధి తన డిగ్రీకి అయిన ఖర్చును తిరి రాబట్టుకోవడానికి రెండు మూడేళ్లు పట్టేది. ఇప్పుడు  తగ్గాల్సింది పోయి పెరిగిపోయింది. ఏకంగా 5 ఏళ్లకుపైనే: పడుతోంది. మరోవైపు గగ్ ఎకానమీలోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉపాధి అవకాశాలను వేగంగా, తక్కువ అడ్డంకులతో సాధిస్తున్నారని కెరీర్స్.. 360 చెబుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)