Breaking News

Ayodhya Video: బాలరాముడికి సూర్య తిలకం

Published on Wed, 04/17/2024 - 11:39

Live Updates

►బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు.. మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై పడిన సూర్య కిరణాలు..

►భక్తజన సంద్రంగా మారిన అయోధ్య.

►బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు 

►ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి 

►భారీ ఏర్పాట్లు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 

►ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం వేడుక

►అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు.

ఇక, శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బాలరాముడు.  పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో బాల రాముడు మెరిసిపోతున్నాడు. కాసేపట్లో బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్న సూర్యభగవానుడు. ఈ సందర్భంగా నాలుగు నిమిషాలపాటు బాలరాముడి నుదుటిపై కిరణాలు పడతాయి. భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ఆలయ నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. 

దర్శన వేళలు..
ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది.

ఏకంగా లక్ష కేజీల లడ్డూలు..
శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్‌ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)