Breaking News

వేసవిలో అక్కడకు వెళితే మాడి మసైపోతారు

Published on Mon, 03/31/2025 - 13:53

శ్రీగంగానగర్ (రాజస్థాన్): వేసవికాలం రాకముందే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల వడగాడ్పులకు జనం విలవిలలాడిపోతున్నారు. వేసవి ప్రవేశించకముందే ఇలా ఉంటే, ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే మనదేశంలోని ఒక జిల్లాలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ సమయంలో అక్కడికి ఎవరైనా వెళితే మాడిమసైపోవాల్సిందే..

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా(Sri Ganganagar District)లో వేసవిలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతం భారత్‌లో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా గుర్తించారు. భారత్‌-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ జిల్లాలో వేసవికాలం దడ పుట్టిస్తుంది. గతంలో ఈ జిల్లా బికనీర్‌లో భాగంగా ఉండేది. ఆ తరువాత దీనిని మరో జిల్లాగా మార్చారు. శ్రీగంగానగర్‌ జిల్లాకు దక్షిణాన బికనీర్, పశ్చిమాన పాకిస్తానీ పంజాబ్, ఉత్తరాన భారత పంజాబ్‌ ప్రాంతంలోని ఫాజిల్కా జిల్లాలు ఉన్నాయి.

వేసవి కాలంలో శ్రీగంగానగర్‌ జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకుపైగా ఉంటుంది. ఫలితంగా జిల్లాలో మధ్యాహ్నం సమయంలో రోడ్లపై ఒక్కరు కూడా కనిపించరు. రాజస్థాన్‌(Rajasthan)లోని ఈ జిల్లా గోధుమ, ఆవాలు, పత్తి పంటలకు ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో పంజాబీ ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఇక్కడి మహిళలు ఎంబ్రాయిడరీ చేసిన స్కార్ఫ్‌లను ధరిస్తుంటారు. శ్రీ గంగానగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలకు ఒక కారణం ఉంది. పాకిస్తాన్‌ నుంచి వచ్చే వేడిగాలులు కారణంగా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 50 డిగ్రీలు కూడా దాటుతుంటాయి. శ్రీగంగానగర్‌లో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదువుతుంటుంది. 

ఇది కూడా చదవండి: ఏప్రిల్‌ 19 నుంచి కట్రా- శ్రీనగర్‌ ‘వందేభారత్‌’

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)