Breaking News

Varanasi: ఉమ్మినా.. కుక్క మలాన్ని కడగకున్నా..

Published on Thu, 10/30/2025 - 15:10

వారణాసి: దేశంలోని అత్యంత పురాతన పుణ్యక్షేత్రం వారణాసిలో పరిశుభ్రతకు స్థానిక అధికారులు మరింత ప్రాధాన్యతనిస్తున్నారు. బహిరంగంగా చెత్త వేసేవారిపై ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఇకపై బహిరంగంగా రోడ్లపై ఉమ్మివేసేవారిపై జరిమానా విధించేందుకు సిద్ధం అయ్యింది.

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసిని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ప్రజా సంబంధాల అధికారి సందీప్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఇకపై వారణాసిలో ఎవరైనా రోడ్లపై బహిరంగంగా ఉమ్మి వేస్తే రూ.250 జరిమానా విధిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నియమాలు- 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కదిలే వాహనం నుండి చెత్త వేయడం, ఉమ్మివేయడం  లాంటి చర్యలు చేస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధిస్తామని,  వీధుల్లో జంతువులకు ఆహారాన్ని పెడితే రూ. 250 జరిమానా విధించనున్నామన్నారు.

నగరంలోని పార్కులు, రోడ్లు లేదా డివైడర్లపై చెత్త వేసేవారికి రూ. 500 జరిమానా విధిస్తామని, బహిరంగ ప్రదేశాల్లో కుక్కల మలాన్ని శుభ్రం చేయని పెంపుడు జంతువుల యజమానులపై కూడా  జరిమానా ఉంటుందన్నారు. నదులు, కాలువలు, మురుగు నీటి కాలువల్లో వ్యర్థాలను లేదా జంతువుల అవశేషాలను పారవేస్తే రూ. 750 జరిమానా విధిస్తామని సందీప్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిశుభ్రతా ప్రమాణాలను ఆదర్శవంతంగా నిలిపేందుకే ఈ చర్యలు చేపడుతున్నామన్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)