Breaking News

ప్రకృతి అద్భుతం.. లడఖ్ లో మంచు చిరుతలు..!

Published on Wed, 02/04/2026 - 05:23

లడఖ్ నుండి వచ్చిన ఒక అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హిమాలయ పర్వతాలలో మంచు చిరుత తన కుటుంబంతో పరుగులు పెడుతూ కనిపించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) షేర్ చేసిన ఈ అరుదైన 43 సెకన్ల క్లిప్ లక్షలాది మంది జంతు ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. లడఖ్ నుండి వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

మంచు చిరుతలను “పర్వతాల దెయ్యాలు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి రాళ్ళు, మంచులో పూర్తిగా కలిసిపోతాయి. వాటిని ఇలా చూడటం దాదాపు అసాధ్యం..!ప్రఖ్యాత IFS అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఒక విషయాన్ని ప్రస్తావించారు. “పర్వతాల దెయ్యాలు.. ఈ ప్రాణాంతకమైన హిమాలయాల మంచుల్లో పరుగెడుతున్నాయో.. ఈ మంచు దయ్యాలు అని పిలవబడే మంచు చిరుతపులులను మన భారత సైన్యాన్ని చూడవచ్చు” అని రాశారు.

మంచులోనూ, మైదానాల్లోనూ జీవించే సామర్థ్యం వీటికి సొంతం. వాటిల్లాగే విధులు నిర్వహిస్తున్న భారత్ సైన్యానికి సాధ్యం. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా, మనుగడ అసాధ్యం అనిపించే ఈ మంచు ఏడారి ప్రాంతాల్లో ఉంటూ భారతదేశాన్ని రక్షించే సైనికులకు నివాళి. అంటూ IFS అధికారి పర్వీన్ కస్వాన్ పేర్కొన్నారు. మరోవైపు, IAS అధికారిణి సుప్రియా సాహు దీనిని “ప్యూర్ వైల్డ్ జాయ్” అని పేర్కొన్నారు. “ఈ అద్భుతమైన జీవులు మంచు మధ్య కనిపించినప్పుడు, నిర్జీవ పర్వతాలు ప్రాణం పోసుకున్నట్లుగా ఉంటుంది. ఈ దృశ్యం నిజంగా ఆత్మను ఓదార్చుతుంది.” అని రాశారు.

ఈ వీడియో ద్వారా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపింది. రోడ్డు నిర్మాణం, ప్రకృతి పరిరక్షణ ఒకేసారి సాధ్యమని వివరించారు.“మేము రోడ్లు నిర్మిస్తాము, కానీ మూగ జీవుల ఇళ్లను ధ్వంసం చేయకుండా, వాటిని సంరక్షించడం ద్వారా” అని  వివరించింది.

ఇదిలావుంటే, ప్రపంచ వన్యప్రాణి నిధి (WWF) ప్రకారం, భారత ప్రభుత్వం హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాలలో మంచు చిరుతను ఒక ప్రధాన జాతిగా గుర్తించింది. తాజా నివేదిక (SPAI) ప్రకారం, భారతదేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. వీటిలో, లడఖ్‌లో మాత్రమే అత్యధిక సంఖ్యలో 477 మంచు చిరుతలు జీవిస్తున్నాయి.ఈ అరుదైన వీడియో ద్వారా లడఖ్ మంచు పర్వతాల అద్భుతం, ప్రకృతి సంరక్షణ అవసరం, మరియు మన దేశ సైన్య రక్షణ సామర్థ్యం ఒకేసారి చూపించబడుతోంది.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు