Breaking News

ఆ తీర్పు సరైందే

Published on Wed, 07/08/2026 - 04:50

అహ్మదాబాద్‌: 2008 నాటి అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం)కు చెందిన 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు 2022లో ఇచి్చన చరిత్రాత్మక తీర్పును గుజరాత్‌ హైకోర్టు సమర్ధించింది. మరో 11 మందికి విధించిన జీవిత కాల జైలు శిక్షలు సైతం సరైనవేనని స్పష్టం చేసింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్‌ ఏవై కోగ్జె, జస్టిస్‌ సమీర్‌ దవేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది.

ఒకే కేసులో అత్యధికులకు మరణ శిక్షలు విధిస్తూ 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు దేశ న్యాయచరిత్రలోనే మొట్టమొదటిది. మరణ శిక్ష పడిన వారిలో నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి)మాజీ నేత సఫ్దర్‌ నగోరీ కూడా ఉన్నాడు. అప్పటి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన 56 కుటుంబాల వారికి రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున 2027 మార్చి 30వ తేదీలోగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అయితే, హైకోర్టు తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)