Breaking News

ISRO SpaDeX Mission: స్పేడెక్స్‌ ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్: ఇస్రో

Published on Sun, 01/12/2025 - 08:58

భారత స్పేడెక్స్‌ ఉపగ్రహాల పనితీరుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అప్‌డేట్‌ ఇచ్చింది. నేడు(ఆదివారం) ఈ ఉపగ్రహాలు మరింత దగ్గరయ్యాయి. శనివారం వీటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉంది. తాజాగా వీటి దూరం తొలుత 15 మీటర్లకు చేరుకోగా, ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను మూడు మీటర్ల మేరకు దగ్గరకు తీసుకువచ్చి, తరువాత సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకురాగలిగింది.
 

ఈ ‍ప్రయోగానికి సంబంధించిన డేటాను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం డాకింగ్ ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది. శాటిలైట్లలోని వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ప్రస్తుతానికి అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని, ప్రస్తుతం ఎస్‌డీ01 (ఛేజర్​), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్​) రెండూ సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని తెలిపింది. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసిందని, ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను(Satellite) సురక్షితమైన దూరానికి తరలించామని ఇస్రో ఒక ట్వీట్‌లో పేర్కొంది.

కాగా ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్‌) ఎప్పుడు చేపడతామన్నది  ఇస్రో ఇంకా వెల్లడించలేదు.2025 జనవరి 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని  గతంలో ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత  ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది.  ఇస్రో 2024 డిసెంబర్​ 30న ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) శాటిలైట్లను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో  వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పే​డెక్స్​ ప్రయోగం(Spadex experiment) పూర్తిగా విజయవంతమైతే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది.

ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)