Breaking News

కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!

Published on Mon, 08/21/2023 - 08:40

ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్‌జీత్‌ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 

మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ బోహ్‌నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్‌ సింగ్‌ తండ్రి బల్‌దేవ్‌సింగ్‌ రైతు. అతని తల్లి హర్‌జిందర్‌ కౌర్‌ గృహిణి. సుఖజీత్‌ సింగ్‌ తమ్ముడు జగజీత్‌సింగ్‌ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. 

28 ఏళ్ల సుఖజీత్‌ సింగ్‌ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్‌లోని ఒక కాఫీషాప్‌లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్‌లోని బిల్లింగ్‌ సెషన్‌లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్‌ బోహ్‌ నీ పనిచేస్తోంది. సుఖజీత్‌ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్‌ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నారు. 

అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్‌ సింగ్‌ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్‌ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్‌ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్‌ బాగ్‌లో వివాహం చేసుకున్నారు.

సుఖజీత్‌ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్‌ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్‌ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్‌ చేసుకున్నామని తెలిపారు. 
ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)