Breaking News

40 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు

Published on Tue, 05/13/2025 - 09:26

కొరుక్కుపేట(తమిళనాడు): చిన్న వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ హోటల్‌ యజమాని 40 ఏళ్ల తరువాత తల్లిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ త్రంలో ఆనందాన్ని నింపింది. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని కదిర నరసింహం గ్రామానికి చెందిన నటరాజన్, అతని భార్య రుక్మిణి. ఈ దంపతులకు కుమార్, సెంథిల్, మురుగన్‌ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు 1985లో తమ కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లారు. 

ఆ సమయంలో, అతని తల్లిదండ్రులు పెద్ద కొడుకు కుమార్‌ను పనికి వెళ్లమని కోరారు. దీంతో తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా, 12 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయిన కుమార్‌కు పుదుకోట్టై జిల్లాలోని మాచువాడి ప్రాంతంలోని ఆరుముగం అనే వ్యక్తికి చెందిన హోటల్‌లో ఉద్యోగంలో చేరాడు. కుమార్‌కు వివాహమై మాచువాడి గ్రామంలో భార్యతో పాటూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తర్వాత కుమార్‌ రెస్టారెంట్‌ నడుపుతున్నాడు. 

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బస్సులో తేని వెళ్లేసరికి గతం అంతా కళ్లముందు మెదిలింది. దీంతో కుటుంబ సమేతంగా కదిర నరసింగపురంలో దిగారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిని చూశాడు. మిగిలిన కుటుంబ సభ్యులు పెద్ద కొడుకు కుమార్‌ వచ్చాడని తల్లికి సమాచారం అందించారు. తన భార్య, కుమార్తెలను కూడా పరిచయం చేశాడు. రుక్మిణి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై తిరిగి కలుసుకున్నందుకు ఆనందంతో కన్నీళ్లతో కౌగిలించుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపింది.   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)