Breaking News

తల్లి చితికి నిప్పంటిస్తూ.. గుండెపోటుతో కుమారుని మృతి

Published on Sat, 01/04/2025 - 13:40

ఒక్కోసారి మృతికి సంబంధించిన కొన్ని ఘటనలు రెండింతల విషాదాన్ని పంచుతాయి. ఒకేసమయంలో కుటుంబసభ్యులిద్దరు మృతి చెందడాన్ని ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.  

తన తల్లి చితికి నిప్పుపెడుతున్న ఒక కుమారుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, ఉన్నట్టుండి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవారు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే అతను మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సోహ్నాలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడం స్థానికులకు త్రీవ విషాదాన్ని పంచింది.  ఈ ఘటనల అనంతరం బంధువులు తొలుత తల్లికి ఆ  తర్వాత కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు.

సోహ్నా పఠాన్ వాడా నివాసి ధరమ్ దేవి (92) వయోభారంతో మృతి చెందారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె కుమారుడు సతీష్‌ (69) తల్లి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఛాతీ నొప్పికి లోనయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్‌ను పరిశీలించి, మృతిచెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ధరమ్ దేవి భర్త మరణించారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)