Breaking News

తల్లిని కడతేర్చిన కుమారుడు

Published on Sun, 08/31/2025 - 11:55

తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహించి తల్లిని కుమారుడు కడతేర్చాడు. నెల్లై జిల్లా నాంగునేరి మూలైకరైపట్టి సమీపంలోని ఎడుప్పల్‌ గ్రామానికి చెందిన పూల్పాండి. ఇతని భార్య రెజీనా (43). వీరికి కొంబయ్య (22), వినోద్‌ (13) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కొంబయ్య కూలీ పనిచేస్తున్నాడు. వినోద్‌ ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. 

రెండేళ్ల క్రితం పూల్పాండి మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రెజీనా తన కుమారులతో కలిసి ఎడుప్పల్‌ గ్రామంలో నివసిస్తోంది. కొన్ని రోజులుగా రెజినాకు, ఆమె కుమారుడు కొంబయ్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆ ప్రాంతంలో జరిగిన ఆలయ ఉత్సవాన్ని చూసి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కొంబయ్య తన తల్లితో గొడవపడ్డాడు. ఇనుపరాడ్‌తో రెజీనా తలపై కొట్టి హతమార్చి పారిపోయాడు. 

మూలైకరైపట్టి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నెల్లై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో రెజీనా అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉందని కొంబయ్యకు తెలియడంతో తల్లిని మందలించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆలయ ఉత్సవం చూసి కొంబయ్య ఇంటికి వచ్చాడు. ఆసమయంలో రెజీనా, యువకుడు ఏకాంతంగా ఉన్నట్లు తెలిసింది. కొంబయ్య, చూసిన యువకుడు  పారిపోయాడు. కొంబయ్య తల్లితో గొడవ పడి తల్లిని హత్య చేసినట్లు తెలిసింది. కొంబయ్యను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.   

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)