Breaking News

అగ్నిపథ్‌ స్కీమ్‌లో కీలక మార్పులు.. అగ్నివీర్లకు గుడ్‌న్యూస్‌!

Published on Sun, 07/09/2023 - 16:49

ఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని త్రివిధ దళాల్లో అగ్నిపథ్‌ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వారిని అగ్నివీర్లు అని పిలుస్తున్నారు. అయితే, అగ్నిపథ్‌ పథకంపై కేంద్ర​ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అగ్నివీర్లకు శుభవార్త అందించింది. 

వివరాల ప్రకారం.. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అగ్నివీర్ల కాల పరిమతి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్‌ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే కేంద్రం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ స్కీమ్‌ కింద 17.5-21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్‌మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే  మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. ‍కేవలం ఇండియన్‌ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)