Breaking News

రేపు భూమిని తాకనున్న సౌర జ్వాలలు!

Published on Sat, 10/05/2024 - 04:34

సౌరప్రకోపం భూమిని అల్లాడించనుంది. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా ఏఆర్‌3842 సన్‌స్పాట్‌ మరోసారి బద్దలైంది. ఎక్స్‌9.1 కేటగిరీలోకి వచ్చే అత్యంత అత్యంత శక్తిమంతమైన సోలార్‌ ఫ్లేర్‌కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయోనీకరణం చెందింది! ఈ పేలుడు ధాటికి పుట్టుకొచి్చన శక్తిమంతమైన సౌర జ్వాలలు ఆదివారం భూమిని గట్టిగా తాకనున్నాయి. ఇప్పటికే సూర్యునిలో సంభవించిన కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ) దీనికి తోడవనుంది. ఫలితంగా భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి, పెద్దపెట్టున విడుదలయ్యే రేడియేషన్‌ ప్రపంచమంతటా ప్రభావం చూపనుంది. దెబ్బకు ఉపగ్రహాలతో పాటు పలు దేశాల్లో పవర్‌ గ్రిడ్లతో పాటు నావిగేషన్‌ వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు అట్లాంటిక్‌ దక్షిణ ప్రాంతంలోని పలు దేశాల్లో షార్ట్‌వేవ్‌ రేడియో బ్లాకౌట్లు సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరించారు. రేడియో ఆపరేటర్లకు కనీసం అరగంటకు సిగ్నల్స్‌ అందబోవని వివరించారు. వీటివల్ల అరోరాలు (కాంతి వల యాలు) ఏర్పడనున్నాయి. 

కొంతకాలంగా ఉగ్ర రూపు 
సూర్యుడు ప్రస్తుతం తన 25వ సౌరచక్రం మధ్యలో ఉన్నాడు. దాంతో కొంతకాలంగా ఉగ్రరూపు దాలుస్తున్నాడు. సోలార్‌ మాగ్జిమంగా పేర్కొనే ఈ పరిస్థితులు ఊహించిన దానికంటే ముందే సంభవిస్తున్నట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంసూర్యునిపై నిరంతర పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు, సీఎంఈలకు దారి తీస్తుంది. ఇవి భూమిపై పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.        – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

#

Tags : 1

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు