Breaking News

రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట

Published on Wed, 11/13/2024 - 07:45

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. రైలులోని జనరల్‌ కోచ్‌లో ఝాన్సీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ యువకుడిని పాము కాటు వేసింది. దీంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. గ్వాలియర్‌లో అధికారులు రైలును నిలిపివేసి,  బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌కు చెందిన 30 ఏళ్ల భగవాన్‌దాస్ ఢిల్లీకి వెళ్లేందుకు ఖజురహో-ఝాన్సీ రైలులోని జనరల్ కోచ్‌లో ఎక్కాడు. బోగీలో జనం ఎక్కువగా ఉండడంతో డోర్‌ వెనకే నిలబడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో దబ్రా-గ్వాలియర్ మధ్య రైలు నడుస్తుండగా భగవాన్‌దాస్‌ను పాము కాటువేసింది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు.  అక్కడున్న ప్రయాణికులు అ పామును చూసి, హడలిపోయిన దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.

ఇంతలో ఒక ప్రయాణికుడు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, సంఘటన గురించి  అధికారులకు తెలియజేశాడు. రైలు 10.30 గంటలకు గ్వాలియర్‌కు చేరుకోగానే, రైలు అధికారులు బాధితుడిని రైలు నుండి దింపి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పీఆర్‌ఓ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిజానికి రైలులో ఇటువంటి పాములు  ఉండవని, వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఇలాంటి పనికి పాల్పడి ఉంటారన్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ మార్క్‌.. ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామికి కీలక పదవులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)