Breaking News

నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్‌

Published on Sun, 04/28/2024 - 09:33

ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

అమేథీలో నామినేషన్‌కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్‌కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్‌ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.

అమేథీతో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్‌ ఎవరికీ టిక్కెట్‌ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు  ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె  ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)