Breaking News

ఉత్తరాదిపై పొగమంచు దుప్పటి.. గ్యాస్‌ ఛాంబర్‌గా రాజధాని!

Published on Thu, 11/14/2024 - 07:27

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా ఢిల్లీతో పాటు, పలు ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. గాలి విషపూరితంగా మారింది. వాయు నాణ్యత కనిష్టానికి చేరింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలోని జనం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాతావరణశాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన తెల్లటి పొగమంచు కమ్మేసినట్లు కనిపిస్తోంది. మహారాష్టలోనూ ఇదే స్థితి కనిపిస్తోంది. మొన్నటి దీపావళికి స్వల్పంగా కనిపించిన ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత  ఏడాది నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు ఇదే స్పష్టమవుతోంది. కొరియన్ జియో కాంప్‌శాట్ 2ఎ ఉపగ్రహం పంపిన రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు  ఇది తేలింది. తాజా చిత్రాలను  చూస్తే ఢిల్లీపై పొగమంచు దట్టంగా అలముకున్నట్లు కనిపిస్తోంది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ వర్గానికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది.
 

గ్యాస్‌ ఛాంబర్‌గా రాజధాని
దేశరాజధాని ఢిల్లీలోని ప్రజలు ఇప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(కేంద్ర కాలుష్య నియంత్ర మండలి). పంట వ్యర్ధాల దహనం, వాహన కాలుష్యం, గాలి వేగం మందగించడంతో కాలుష్యం పెరగడానికి కారణంగా గుర్తించారు.

సీపీసీబీ తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ)432కి చేరుకుంది. అంటే ఢిల్లీలో గాలి ‘వెరీ సీరియస్ కేటగిరీ’లో ఉంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల వాయు నాణ్యత సూచికను సీపీసీబీ విడుదల చేసింది. దీని ప్రకారం నజఫ్‌గఢ్‌లోని గాలి అత్యంత కలుషితంగా మారింది. ఏక్యూఐ 482గా నమోదయ్యింది. ఇదేవిధంగా ఏక్యూఐ 480తో నెహ్రూ నగర్ రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఆనంద్ విహార్  ఉంది. ఈ నేపథ్యంలో ​గ్రాప్ - 3 నియంత్రణల అమలుపై నేడు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి