Breaking News

స్లీపర్‌ వందేభారత్‌ ప్రత్యేకతలివే..

Published on Sun, 06/16/2024 - 11:55

త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్‌ రైలు పూర్తిగా భారత్‌లోనే తయారు కావడం విశేషం.  

ఇప్పటి వరకు వందేభారత్‌ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.

తాజాగా స్లీపర్ వందే భారత్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్‌ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి  అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు  ఉన్నాయి.

సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్‌కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)