Breaking News

ఆ ఆరు జిల్లాల్లో అధిక ఓటింగ్‌.. పార్టీల్లో దడ!

Published on Mon, 11/27/2023 - 15:42

జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 74.96 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఇది గత 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఎక్కువ. ఇక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీగా ఓటింగ్‌ నమోదైంది. దీంతో ప్రధాన పార్టీల్లో దడ మొదలైంది. కౌంటింగ్‌ రోజున ఫలితం గురించి భయం నెలకొంది.

80 శాతానికి పైగా ఓటింగ్‌ 
రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల్లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బన్స్వారా, జైసల్మేర్, చిత్తోర్‌గఢ్, హనుమాన్‌గఢ్, ఝలావర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా 83 శాతం ఓటింగ్‌తో బన్స్వారా జిల్లా టాప్‌లో ఉండగా 80.41 శాతంతో చిత్తోర్‌గఢ్, 82.52 శాతంతో హనుమాన్‌గఢ్, 82.32 శాతంతో జైసల్మేర్‌ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

అసెంబ్లీ స్థానాలవారీగా..
రాష్ట్రంలోనే అత్యధికంగా 88.13 శాతం ఓటింగ్‌తో కుషాల్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 87.79 శాతంతో పోఖ్రాన్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రెండో స్థానంలో ఉండగా, 86.11 శాతంతో తిజారా, 85.58 శాతంతో నింబహెరా, 85.35 శాతంతో ఘటోల్, 84.22 శాతంతో బారీ, 84.12 శాతంతో మనోహర్తన నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)