Breaking News

రాజకీయాల్లో వారసులదే రాజ్యం!

Published on Sat, 09/13/2025 - 05:10

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ప్రతి ఐదుగురిలో ఒకరు (21%) రాజకీయ కుటుంబాల నుంచి వచి్చనవారేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫారŠమ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) సమగ్ర విశ్లేషణలో తేటతెల్లమైంది. 

దేశవ్యాప్తంగా మొత్తం 5,204 మంది ప్రజాప్రతినిధులపై విశ్లేషణ చేయగా, వీరిలో 1,107 మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. లోక్‌సభలో ఈ ప్రభావం అత్యధికంగా 31 శాతంగా ఉంది. ముఖ్యంగా, మహిళా ప్రజాప్రతినిధుల్లో ఈ ధోరణి రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. దాదాపు సగం మంది (47%) వారసత్వంగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని నివేదిక వెల్లడించింది. వారసత్వ రాజకీయాల వాటాలో ఆంధ్రప్రదేశ్‌ (34%) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 

రాష్ట్రాల వారీగా తీరిదే.. 
దేశంలోని రాష్ట్రాలను పరిశీలిస్తే, సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 141 మంది (23%) ప్రజాప్రతినిధులు రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అయితే, మొత్తం ప్రజాప్రతినిధుల్లో వారసుల శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ (34%) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి పైగా వారసులే కావడం గమనార్హం. ఆ తర్వాత మహారాష్ట్ర (32%), కర్ణాటక (29%) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశ్లేషించిన 255 మంది ప్రజాప్రతినిధులలో 86 మంది (34%) వారసులే. మహారాష్ట్రలో 403 మందిలో 129 మంది (32%), కర్ణాటకలో 326 మందిలో 94 మంది (29%), తెలంగాణ మహిళా ప్రజాప్రతినిధులలో 64% మంది వారసత్వ నేపథ్యం కలవారేనని వెల్లడైంది.

మహిళల ప్రాతినిధ్యంలో అసమానతలు: 
రాజకీయాల్లోకి మహిళల ప్రవేశానికి కుటుంబ నేపథ్యం ఒక ముఖ్యమైన మార్గంగా మారుతోందని ఈ నివేదికలోని గణాంకాలు పేర్కొన్నాయి. మొత్తం మహిళా ప్రజాప్రతినిధులలో 47% మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే. పురుషులలో ఈ సంఖ్య కేవలం 18% మాత్రమే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 69% మహిళా ప్రతినిధులు, తెలంగాణలో 64% మంది వారసులే కావడం గమనార్హం. రాష్ట్రాల అసెంబ్లీల (20%) కన్నా లోక్‌సభలో (31%) వారసత్వ ప్రభావం ఎక్కువగా ఉంది. జాతీయ రాజకీయాలపై కుటుంబాల పట్టు బిగుస్తున్నట్లు ఇది సూచిస్తోంది. పారీ్టలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ‘గెలుపు గుర్రం’అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం, డబ్బు, కండబలం వంటివి వారసత్వ రాజకీయాలకు కారణమవుతున్నాయి. భారతీయ సమాజంలో కుటుంబ సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యత కూడా వారసులను ఓటర్లు ఆమోదించడానికి ఒక కారణంగా నిలుస్తోంది.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)