Breaking News

జుబీన్‌ కడసారి చూపునకు లక్షలాదిగా జనం 

Published on Mon, 09/22/2025 - 06:29

గౌహతి: ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ కడసారి చూపు కోసం ఆదివారం అసోంలోని గౌహతికి లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. గౌహతిలోని అర్జున్‌ భోగేశ్వర్‌ బారువా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కిక్కిరిసిపోయింది. ఉదయానికే అక్కడికి చేరుకున్న జనం ఎండ తీవ్రతను, ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాన్ని సైతం జనం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. అభిమానులు జుబీన్‌ చిత్రాలున్న కటౌట్లను చేబూని, ఆయనకిష్టమైన పాటలు పాడారు. జుబీన్‌ గార్గ్‌ శుక్రవారం సింగపూర్‌లోని సముద్రంలో ఈదుతూ చనిపోవడం తెల్సిందే.

 సింగపూర్‌ నుంచి జుబీన్‌ మృతదేహాన్ని విమానంలో శనివారం అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకువచ్చారు. మరో విమానంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి గౌహతికి మృతదేహం చేరుకుంది. గౌహతి విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని కహిలీపారలో ఉన్న జుబీన్‌ నివాసం వరకు దారి పొడవునా వేలాది మంది ఆఖరిసారిగా చూసుకునేందుకు రహదారిపైకి చేరారు. దీంతో ఆరు గంటల సమయం పట్టింది. 

మృతదేహం స్టేడియంకు చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయింది. అప్పటికే అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వేదికపై గాజు శవ పేటికలో ఉంచిన జుబీన్‌ మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు జనం క్యూ కట్టారు. రాత్రయినా అభిమానుల తాకిడి కొనసాగుతోంది. దీంతో, అభిమానుల సందర్శనార్ధం మృతదేహాన్ని రాత్రంతా అక్కడే ఉంచుతామని, ఉదయం కూడా అక్కడే ఉంటుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తన భర్త కోసం తరలివచి్చన అసంఖ్యాక అభిమానులకు జుబీన్‌ భార్య, ప్రముఖ డిజైనర్‌ గరిమ కృతజ్ఞతలు తెలిపారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)