Breaking News

Kedarnath: ఒక రోజంతా బండరాళ్లలో.. చివరికి వచ్చాడిలా

Published on Sun, 08/04/2024 - 10:09

ప్రకృతి విపత్తులో చిక్కుకున్న అతను బండరాళ్ల కింద ఇరుక్కుపోయాడు. సహాయం కోసం రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆపన్నహస్తాల కోసం కొన్ని గంటపాటు ఎదురు చూశాడు. చివరికి అతని నిరీక్షణ ఫలించింది.

ప్రస్తుతం కేదార్‌నాథ్ ధామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం చీకటిపడ్డాక కేదార్‌నాథ్ నడకమార్గంలో వెళుతున్న చమోలీ జిల్లాకు చెందిన గిరీష్‌ చమోలీ ఊహించని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏడీఆర్‌ఎఫ్‌ సైనికులు గిరీష్ ఆర్తనాదాలను విన్నారు. అతనిని రక్షించేందుకు ఆ బండరాళ్లను పగలగొట్టే పని మొదలు పెట్టారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి వారు గిరీష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

గిరీష్‌ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు చెబుతూ ‘బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బయటకట్టి ఉన్న మా గుర్రాన్ని కాపాడుకునేందుకు నేను నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్లాను. ఇంతలో బండరాళ్ల కింద చిక్కుకుపోయాను. అయితే ఊపిరి పీల్చుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా శరీరమంతా బండరాళ్ల కింద చిక్కుకుపోయింది. సహాయం కోసం రాత్రంతా అరుసూనే ఉన్నాను. నా గొంతు విని రెస్క్యూ సిబ్బంది నన్ను కాపాడారు’ అని తెలిపాడు. కాగా గిరీష్‌కు చికిత్స అందించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ మణికాంత్ అతనిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. 

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)