Breaking News

మిక్చర్‌ ఇవ్వనందుకు బార్‌లో గొడవ

Published on Tue, 10/28/2025 - 13:21

కర్ణాటక రాష్ట్రం: బార్‌లో మద్యం తాగే సమయంలో మిక్చర్‌ ఇచ్చే విషయానికి సంబంధించి బార్‌ క్యాషియర్, మద్యం తాగడానికి వచ్చిన వ్యక్తి మధ్య గొడవ జరిగి బార్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన క్యాషియర్‌ను వెంబడించి అతని ఇంట్లోనే భార్య, పిల్లల ముందే దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి తాలూకాలోని లక్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుమారస్వామి(43) హత్యకు గురైన వ్యక్తి. ఇదే గ్రామానికి చెందిన సుభాష్‌(24) అనే వ్యక్తి హత్య చేసిన నిందితుడు. వివరాలు.. అశోక వైన్స్‌లో కుమారస్వామి గత 25 ఏళ్లుగా ఎంతో విశ్వాసంతో పని చేస్తున్నాడు. కుమారస్వామి మూలతః చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహళ్లి గ్రామానికి చెందినవాడు. మృతుడికి భార్య, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు.  

బార్‌ మూస్తుండగా మద్యం కొనుగోలు 
ఆదివారం రాత్రి సుభాష్‌ బార్‌ మూసే సమయంలో మద్యం తీసుకుని మిక్చర్‌ అడిగాడు. అయితే బార్‌ మూసే సమయం కావడం వల్ల క్యాషియర్‌ కుమారస్వామి మిక్చర్‌ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ విషయానికి సంబంధించి గొడవ పడిన సుభాష్‌ అంతటితో ఊరుకోకుండా కుమారస్వామిని ఇంటి వరకు వెంబడించి ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో చాకుతో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్పీ బి.నిఖిల్, డీఎస్పీ నాగ్తె, మాలూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సుభాష్‌ ను అరెస్టు చేశారు.   

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)