Breaking News

స్వాతంత్య్రానంతరం కశ్మీర్‌ శక్తిపీఠంలో నవరాత్రులు

Published on Wed, 10/18/2023 - 11:38

కశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.

పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్‌లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు.

కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. 
ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)