అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠకు శరద్ పవార్ దూరం

Published on Wed, 01/17/2024 - 12:55

ముంబయి: అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఆహ్వానం పంపించినందుకు రామమందిరం ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నందున దర్శనం పొందడం సులభం కాదని అన్నారు. జనవరి 22 తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుందని ఆయన చెప్పారు. త్వరలో అయోధ్యను దర్శిస్తానని వెల్లడించారు. 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, భక్తికి రాముడు ప్రతీక అని శరద్ పవార్ అన్నారు. "అయోధ్యలో జరిగే కార్యక్రమం కోసం రామభక్తులలో విపరీతమైన ఉత్సాహం ఉంది. వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భం నాకు ఆనందాన్నిస్తోంది. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుంది" అని శరద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు.  అయోధ్య రామున్ని త్వరలో ప్రార్థిస్తానని  శరద్ పవార్ పేర్కొన్నారు. అప్పటికి రామమందిర నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు.

జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠకు జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులతో సహా సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలు అందాయి. జనవరి 23 నుంచి రామాలయాన్ని సాధారణ భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు.   

ఇదీ చదవండి: Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్‌ చేసిన ప్రధాని మోదీ!

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)