Breaking News

Prayagraj: మాఘ మేళాలో నన్ను అడ్డుకున్నారు: స్వామి అవిముక్తేశ్వరానంద

Published on Sun, 01/18/2026 - 19:05

ప్రయాగ్‌రాజ్: మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించారు. సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో పోలీసులు తన అనుచరులను కూడా అడ్డుకున్నారని శంకరాచార్య అన్నారు. పోలీసులు తన శిష్యులను నెట్టివేసి, దురుసుగా ప్రవర్తించారని.. తన పల్లకిని మధ్యలోనే నిలిపివేశారన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సాధువులపై  కూడా దాడులు జరుగుతున్నాయని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుని వెనక్కి వచ్చానని ఆయన చెప్పారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మౌని అమావాస్య నాడు తాను పుణ్యస్నానం ఆచరించబోనని స్వామి అవిముక్తేశ్వరానంద్ స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మౌని అమావాస్య ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘమేళాలో సాధువులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం నుంచే దట్టమైన పొగమంచు, చలి వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు సంగం ఘాట్‌కు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.

యాత్రికుల భద్రత, రద్దీ నియంత్రణకు సంగం ఘాట్ వద్ద భారీ కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సీసీ టీవీ కెమెరాలను, డ్రోన్‌లతో నిరంతర పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం 6గంటల నుంచి దాదాపు యాభై లక్షల మంది భక్తులు వివిధ ఘాట్ల వద్ద పవిత్ర స్నానం చేశారని డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని.. స్నాన ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా సాగుతోందని.. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)