Breaking News

అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

Published on Wed, 01/10/2024 - 12:06

అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితమే జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఉత్సవం వెలుగుల పండుగ దీపావళిలా  ఉంటుందని అన్నారు. 

అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిలో ఒకటి కేవలం శాకాహారం అందించే సెవెన్ స్టార్ హోటల్ అని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించామని అన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు. వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

అయోధ్యలో గ్రీన్ కారిడార్ నిర్మిస్తామని, రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
గత రామ నవమికి ​​ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేయగా, ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు.  అయోధ్యకు వచ్చే రామభక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
 ఇది కూడా చదవండి: బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం!

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)