Breaking News

అక్కడ మే 17 వరకు 144 సెక్షన్.. ఎందుకంటే..

Published on Wed, 03/20/2024 - 15:28

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మే 17 వరకు లక్నోలో 144 సెక్షన్ విధించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, హోలీ, రంజాన్‌తో సహా ముఖ్యమైన, మతపరమైన పండుగల దృష్ట్యా లక్నో నగరంలో 144 సెక్షన్ విధించినట్లు లా అండ్ ఆర్డర్ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలియజేశారు. 

లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25,  జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.

పోలీసుల నిషేదాజ్ఞల ప్రకారం..  ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదు. పాదయాత్రలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడంపై నిషేధం. అలాగే లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ బ్యాండ్‌ల వినియోంగంపై నిషేధం ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా సామాజిక కార్యక్రమాలు, 
నిరసనలు లేదా నిరాహార దీక్షలు చేపట్టడానికి అనుమతి లేదు.

ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రాపై బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. రాజ్‌నాథ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1991 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)